WhatsApp Group
Join Now
కౌశలం సర్వే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ | AP Work From Home Jobs
కౌశలం సర్వే (Koushalam Survey) అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు, నైపుణ్యాభివృద్ధి కల్పించేందుకు ప్రారంభించిన ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం. 18 నుండి 50 సంవత్సరాల వయసు కలిగిన వారు ఈ సర్వేలో తమంతట తాము ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
కౌశలం సర్వే ముఖ్యాంశాలు (Highlights)
- కార్యక్రమం నిర్వహణ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
- వయస్సు పరిమితి: 18 నుండి 50 సంవత్సరాలు
- అర్హత: కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు
- రిజిస్ట్రేషన్ విధానం: ఆన్‌లైన్ (స్వయంగా లేదా గ్రామ/వార్డ్ సచివాలయం ద్వారా)
- సర్వే గడువు: సెప్టెంబర్ 15 వరకు
కౌశలం సర్వే ప్రస్తుత స్థితి
- రాష్ట్ర వ్యాప్తంగా 27.92 లక్షల మంది వివరాలు ఇప్పటికే నమోదు అయ్యాయి.
- వీరిలో 10.03 లక్షల మంది మాత్రమే పూర్తి రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు.
- ఇంకా చాలా మంది అభ్యర్థులు సర్వే పూర్తి చేయాల్సి ఉంది.
- ప్రభుత్వం ఇప్పుడు ప్రజలు స్వయంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది.
కౌశలం సర్వే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ (Step by Step)
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
- ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, ఆధార్‌కి లింక్ అయిన మొబైల్ నంబర్‌కి వచ్చిన OTP వెరిఫై చేయాలి.
- వ్యక్తిగత ప్రాథమిక వివరాలు ఆటోమేటిక్‌గా డిస్ప్లే అవుతాయి.
- మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి నమోదు చేసి, వాటి OTP వెరిఫికేషన్ పూర్తి చేయాలి.
- విద్యార్హతలు (10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పిజి మొదలైనవి) నమోదు చేయాలి.
- చదివిన కోర్సు, కాలేజ్, శాతం లేదా CGPA వివరాలు ఎంటర్ చేయాలి.
- సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి:
- విద్యార్హత సర్టిఫికెట్లు
- కంప్యూటర్/టెక్నికల్ కోర్సులు
- ఇంటర్న్షిప్ లేదా ట్రైనింగ్ సర్టిఫికెట్లు
- అన్ని వివరాలు సరిచూసుకుని Submit క్లిక్ చేయాలి.
కౌశలం సర్వే కోసం అవసరమయ్యే పత్రాలు
- ఆధార్ కార్డ్
- ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్
- ఇమెయిల్ ఐడి
- విద్యార్హత సర్టిఫికెట్లు
- ఇతర నైపుణ్య సర్టిఫికెట్లు (కంప్యూటర్ కోర్సులు, ట్రైనింగ్, ఇంటర్న్షిప్స్)
- చదివిన కాలేజ్ వివరాలు
కౌశలం సర్వేలో రిజిస్ట్రేషన్ ఎందుకు చేయాలి?
- రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ కంపెనీల్లో 5 లక్షలకుపైగా ఉద్యోగావకాశాలు లభ్యమవుతున్నాయి.
- నైపుణ్యానికి అనుగుణంగా Work From Home Jobs, టెక్నికల్ ఉద్యోగాలు, ప్రైవేట్ సెక్టార్ అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది.
- ప్రభుత్వం అందించే నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలు కూడా అర్హత పొందిన వారికి లభిస్తాయి.
కౌశలం సర్వేలో రిజిస్ట్రేషన్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చేయండి
AP dairy farmers scheme 2025: ఏపీలో రైతులకు తీపికబురు.. ఏకంగా 75శాతం రాయితీ, జస్ట్ రూ.115 కడితే చాలు
WhatsApp Group
Join Now