ఆగష్టు 25 నుండి AP Smart Ration Cards పంపిణీ ప్రారంభం! – రేషన్ కార్డు
AP Smart Ration Card 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ATM కార్డు సైజ్ రేషన్ కార్డులను ఈ నెల ఆగష్టు 25, 2025 నుండి పంపిణీ చేయబోతోంది. పాత రేషన్ కార్డులను రీప్లేస్ చేస్తూ, కొత్త కార్డులు ప్రతి కుటుంబానికి గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ఇవ్వనుంది.
📌 కొత్త కార్డులో ఏమేం ఉంటుంది?
- కుటుంబ పెద్ద ఫోటో
- కుటుంబ సభ్యుల పేర్లు
- వారి పుట్టిన తేదీలు
- బంధుత్వ వివరాలు
- రాజకీయ నాయకుల ఫోటోలు ఉండవు
📢 ఈ కొత్త కార్డు పొందాలంటే ఏమి చేయాలి?
- మీ కుటుంబ సభ్యులందరి AP Ration Card eKYC పూర్తయి ఉండాలి.
- పాత కార్డు లో పేర్లు, DOB, బంధుత్వం వంటి వివరాల్లో ఎలాంటి తప్పులుండకూడదు.
- తప్పులు ఉంటే, గ్రామ/వార్డు సచివాలయం లో “Change of Details in Rice Card” ద్వారా అప్డేట్ చేయాలి.
🧾 eKYC పూర్తి అయిందో లేదో ఎలా చెక్ చేయాలి?
- Google లో “AEPOS AP” అని టైప్ చేయండి.
epos.ap.gov.in
వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.Reports
→MIS
→Ration Card Search
అనే ఆప్షన్స్ లోకి వెళ్ళండి.- మీ Rice Card Number ఎంటర్ చేసి డిటైల్స్ చెక్ చేయండి.
- వివరాల్లో తప్పులుంటే వెంటనే సచివాలయం లో అప్డేట్ చేయించుకోండి.
🏠 చిరునామా మారిందా? Address Change Option ఉంది!
మీ కుటుంబం వేరే గ్రామం లేదా పట్నానికి షిఫ్ట్ అయితే, సచివాలయం ద్వారా చిరునామా మార్చుకునే అవకాశం ఉంది. “Change of Details in Rice Card” ఆప్షన్ ద్వారా ఈ మార్పు చేయవచ్చు.
📥 కొత్త కార్డు PDF డౌన్‌లోడ్ చేయవచ్చా?
ప్రస్తుతం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న AP Smart Ration Card ను డిజిటల్‌గా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం లేదు. అయితే, DigiLocker ద్వారా Aadhaar ఆధారంగా పాత కార్డు PDF డౌన్‌లోడ్ చేయవచ్చు.
🔔 ముఖ్య సూచనలు:
కొత్త కార్డు ఒకసారి ప్రింట్ అయితే, దాంట్లో తప్పులు ఉంటే తిరిగి ప్రింట్ చేసే ప్రక్రియపై స్పష్టత లేదు.
అందుకే, మీ వివరాలు ఇప్పుడే సరిచూడండి.
eKYC చేయించని వారు వెంటనే తమ గ్రామ/వార్డు సచివాలయాన్ని సందర్శించండి.
➡️ Ration Card Cancellation 2025: మీ ఇంట్లో ఇవి ఉంటే రేషన్ కార్డు రద్దు! పూర్తి వివరాలు
➡️ NPCI Link: ప్రభుత్వ పథకాల లబ్ధిని సులువుగా పొందండి! (NPCI Link: Get Government Scheme Benefits Easily!)
📢 Share & Support
ఈ సమాచారాన్ని మీ గ్రామం, స్నేహితులు, కుటుంబ సభ్యులందరికీ షేర్ చేయండి – అందరికీ ఉపయోగపడేలా.
Tags: AP Ration Card, Smart Ration Card 2025, eKYC AP Ration Card, Rice Card Correction, AP Government News, Grama Sachivalayam