క్రీడలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం ప్రపంచం టెక్నాలజీ బిజినెస్ ఎంటర్టైన్‌మెంట్ హెల్త్‌ బంగారం వెండి రాశి ఫలాలు ట్రెండింగ్
తాజా వార్తలు
ఆధార్ ఇంట్లో మర్చిపోయారా..? మీ వాట్సప్‌లోనే సులువుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. ఈ నెంబర్‌కు మెస్సేజ్ చేస్తే.. మీ భూమి అడంగల్ రెకార్డ్ ఆన్లైన్ లో కనిపించడం లేదా ? రైతులకు కేంద్రం బిగ్ న్యూస్.. ఒక్క రూపాయి చెల్లిస్తే చాలు.. ఈ ఛాన్స్ మిస్ అవ్వొద్దు.. ఎలక్ట్రిక్ బైక్, స్కూటర్లు కొనేవారికి మోదీ సర్కార్ గుడ్‌న్యూస్.. సబ్సిడీ గడువు పొడిగింపు.. వేల కోట్లు పెంపు! బుక్ చేసిన 4 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. ఇక నుంచి రోజుల పాటు వేచి ఉండక్కర్లేదు.. మీ పిల్లల భవిష్యత్తు కోసం రోజుకు రూ.166 పొదుపు చేస్తే.. చేతికి రూ.61 లక్షలు..! ఏపీ ప్రభుత్వం నుంచి మరో అద్భుతమైన పథకం పట్టాదార్ పాపు పుస్తకాల పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..!! UPI పేమెంట్స్‌పై కొత్త రూల్స్ ఎప్పటి నుంచి? రూ.2,000 దాటితే అదనపు ఛార్జీలు ఉంటాయా? ఏపీలో ఆగస్టు 15 నుంచి కొత్త పథకం

వాట్సాప్‌లోనే సదరం స్లాట్ బుకింగ్, సర్టిఫికెట్ డౌన్‌లోడ్.. కొత్త సేవ ప్రారంభం

WhatsApp Group Join Now

కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్.. జస్ట్ ఈ నెంబర్‌కు Hi అంటే చాలు..! | AP Sadaram WhatsApp Services

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిటల్ గవర్నెన్స్‌లో మరో కీలక అడుగు వేసింది. దివ్యాంగులకు అత్యంత అవసరమైన సదరం సేవలను (Sadaram Services) ఇప్పుడు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో సదరం స్లాట్ బుకింగ్, సర్టిఫికెట్ డౌన్‌లోడ్ వంటి సేవలను ఇంటి నుంచే మొబైల్ ద్వారా పొందే అవకాశం కల్పించింది.

ఇప్పటి వరకు సదరం సేవల కోసం మీ సేవా కేంద్రాలు, స్వర్ణ గ్రామం లేదా స్వర్ణ వార్డు కార్యాలయాలను ఆశ్రయించాల్సి వచ్చేది. స్లాట్ కోసం రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితులు కూడా ఉండేవి. ఇప్పుడు వాట్సాప్ ద్వారా ఈ ప్రక్రియను మరింత సులభంగా మార్చింది ప్రభుత్వం.

సీఎం చంద్రబాబు సూచనల మేరకు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఈ సేవలను మనమిత్ర ప్లాట్‌ఫామ్‌లో ప్రారంభించింది. దీంతో దివ్యాంగులు కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, తమ మొబైల్ నుంచే సదరం సేవలను వినియోగించుకోవచ్చు.

Meebhoomi Adangal
మీ భూమి అడంగల్ రెకార్డ్ ఆన్లైన్ లో కనిపించడం లేదా ?

ఈ సేవలను పొందాలంటే ముందుగా మొబైల్‌లో 9552300009 నంబర్‌ను సేవ్ చేసి, ఆ నంబర్‌కు “Hi” అని వాట్సాప్‌లో మెసేజ్ పంపాలి. అనంతరం కనిపించే Citizen Services విభాగంలో Sadaram Services ఎంపిక చేసుకోవాలి.

అక్కడ Slot Availability, Slot Booking, Certificate Download వంటి మూడు ప్రధాన సేవలు అందుబాటులో ఉంటాయి. స్లాట్ లభ్యతను చూసి, తమకు అనుకూలమైన తేదీ, సమయాన్ని ఎంచుకుని వెంటనే బుక్ చేసుకోవచ్చు.

ఇప్పటికే సదరం సర్టిఫికెట్ ఉన్నవారు కూడా అదే వాట్సాప్ సేవ ద్వారా నేరుగా సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీంతో కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సమయం, ప్రయాణ ఖర్చు రెండూ ఆదా అవుతాయి.

PM Fasal Bima Yojana 2026
రైతులకు కేంద్రం బిగ్ న్యూస్.. ఒక్క రూపాయి చెల్లిస్తే చాలు.. ఈ ఛాన్స్ మిస్ అవ్వొద్దు..

ప్రభుత్వం ఈ కొత్త విధానం ద్వారా సేవలను మరింత పారదర్శకంగా, వేగంగా అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మధ్యవర్తుల అవసరం లేకుండా లబ్ధిదారులే నేరుగా సేవలు పొందే అవకాశం కల్పించడం వల్ల దివ్యాంగులకు మరింత సౌకర్యంగా మారనుంది.

డిజిటల్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం వరుసగా కొత్త సేవలను మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌లో అందుబాటులోకి తీసుకొస్తోంది. సదరం సేవలు కూడా ఇప్పుడు అదే వేదికపై అందుబాటులోకి రావడంతో రాష్ట్రంలోని దివ్యాంగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

WhatsApp Group Join Now

Leave a Comment

WhatsApp