రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. వ్యవసాయంలో డిజిటల్ విప్లవం.. అన్ని మీ అరచేతిలో..!

WhatsApp Group Join Now

రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. వ్యవసాయంలో డిజిటల్ విప్లవం.. అన్ని మీ అరచేతిలో..! | New Fertilizer App

దేశంలోని రైతులకు ఎరువుల పంపిణీని మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. రైతులు ఎరువుల కోసం గంటల తరబడి దుకాణాల వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, మొబైల్ ద్వారానే ముందుగా ఎరువులను బుక్ చేసుకునే కొత్త ఫెర్టిలైజర్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ యాప్ అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా ఎరువుల పంపిణీకి ఒకే విధమైన డిజిటల్ వ్యవస్థ అమలులోకి రానుంది. రైతులు తమ అవసరాలకు అనుగుణంగా ముందుగానే బుకింగ్ చేసుకుని నిర్ణయించిన తేదీ, సమయానికి సంబంధిత డీలర్ వద్ద నుంచి ఎరువులను పొందే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో రైతులు నేరుగా ఎరువుల దుకాణాలకు వెళ్లి స్టాక్ ఉంటేనే కొనుగోలు చేయాల్సి వస్తోంది. కొత్త వ్యవస్థతో ఈ ఇబ్బందులకు ముగింపు పలకాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో రద్దీ తగ్గడమే కాకుండా పంపిణీ ప్రక్రియ కూడా మరింత క్రమబద్ధంగా సాగనుంది.

యాప్‌ను వినియోగించాలంటే రైతులు ముందుగా ఆధార్ నంబర్‌తో నమోదు చేసుకోవాలి. ఓటీపీ ద్వారా ధృవీకరణ పూర్తయ్యాక భూమి వివరాలు, సాగు చేస్తున్న పంట, అవసరమైన ఎరువుల సమాచారాన్ని నమోదు చేయాలి. అనంతరం సమీపంలోని ఎరువుల డీలర్‌ను ఎంపిక చేసి అవసరమైన పరిమాణంలో ఎరువులను బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

LPG Gas Cylinder Booking Rules 2026
ఎల్పీజీ గ్యాస్ గ్యాస్ సిలిండర్ బుకింగ్ కు కొత్త రూల్స్‌

బుకింగ్ పూర్తయిన తర్వాత రైతుల మొబైల్‌కు క్యూఆర్ కోడ్‌తో కూడిన నిర్ధారణ సందేశం పంపబడుతుంది. నిర్ణయించిన తేదీన ఆ క్యూఆర్ కోడ్‌ను డీలర్‌కు చూపించి ఎరువులను సులభంగా పొందవచ్చు.

ఈ యాప్‌లో మరో ప్రత్యేక సౌకర్యంగా సమీపంలోని ఎరువుల దుకాణాల్లో ఏ ఎరువు ఎంత పరిమాణంలో అందుబాటులో ఉందో ముందుగానే తెలుసుకునే అవకాశం కల్పించనున్నారు. దీంతో స్టాక్ లేని దుకాణాలకు వెళ్లి సమయం వృథా చేసుకోవాల్సిన అవసరం ఉండదు.

ఎరువుల పంపిణీని సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ ఫెర్టిలైజర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (IFMS)ను అమలు చేస్తోంది. కొత్త ఫెర్టిలైజర్ యాప్‌ను కూడా ఈ వ్యవస్థతో అనుసంధానం చేసి సబ్సిడీ నిర్వహణ, నిల్వల పర్యవేక్షణ, బ్లాక్ మార్కెటింగ్ నియంత్రణను మరింత బలోపేతం చేయాలని కేంద్రం యోచిస్తోంది.

ప్రస్తుతం తెలంగాణలో యూరియా పంపిణీ కోసం ప్రత్యేక యాప్ అమల్లో ఉండగా, దేశవ్యాప్తంగా కొత్త ఫెర్టిలైజర్ యాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత రాష్ట్రాల వారీగా ఉన్న ప్రత్యేక యాప్‌ల స్థానంలో ఒకే జాతీయ వ్యవస్థ అమలయ్యే అవకాశం ఉందని సమాచారం.

RRB JE Exam Date 2026
రైల్వే ఉద్యోగార్థులకు అలర్ట్.. రైల్వే JE పరీక్ష తేదీలు వచ్చేశాయ్! పరీక్షలు ఎప్పుడంటే?

కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త ఫెర్టిలైజర్ యాప్‌ను ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలల్లో దేశవ్యాప్తంగా ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే రైతులకు సమయానికి ఎరువులు అందడమే కాకుండా పంపిణీలో పారదర్శకత పెరగడం, అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌పై సమర్థవంతమైన నియంత్రణ సాధించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

WhatsApp Group Join Now

Leave a Comment

WhatsApp